আবহাওয়া পশ্চিমবঙ্গ ভারত চাকরি রাশিফল আইপিএল আধ্যাত্মিক টাকা পয়সা স্বাস্থ্য লাইফস্টাইল মিউচুয়াল ফান্ড ব্যবসা অন্যান্য শেয়ার বাজার টিভি সিরিয়াল

ఏప్రిల్ 26న క్యారీలో ‘టాటా’ ఆధ్వర్యంలో ఆర్గానిక్ గార్డెనింగ్ వర్క్‌షాప్

By charangadgets4

Published on: April 21, 2026

Follow Us

---Advertisement---

TATA: ధరిత్రీ దినోత్సవం (Earth Day) సందర్భంగా ప్రకృతిపై మక్కువతో, స్వచ్ఛమైన ఆహారం పండించుకోవడమే లక్ష్యంగా ట్రయాంగిల్ ఏరియా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ కరోలినా (TATA) ఒక ప్రత్యేకమైన ‘ఆర్గానిక్ గార్డెనింగ్ వర్క్‌షాప్’ను నిర్వహిస్తోంది. ఈ నెల 26వ తేదీ, ఆదివారం  క్యారీలోని ఎల్‌విఎస్ ఆర్గానిక్ ఫామ్స్ (LVS Organic Farms) వేదికగా ఈ శిక్షణ కార్యక్రమం జరగనుంది.

 

అవగాహన..
ప్రముఖ సేంద్రియ సాగు నిపుణురాలు , ఫామ్ మెంటర్ లక్ష్మి రామకృష్ణన్ ఈ సెషన్‌కు నాయకత్వం వహిస్తారు. పాల్గొనే వారికి ఈ కింది అంశాలపై అవగాహన కల్పిస్తారు.

 

  • మట్టిని సిద్ధం చేయడం , ఎరువుల వినియోగం.
  • విత్తనాలు వేయడం , సాగు పద్ధతులు.
  • నీటి యాజమాన్యం , కలుపు నివారణ.
  • పంట కోత , నిల్వ చేసే విధానాలు.
  • పురుగు మందుల ప్రభావం తగ్గించి ఆరోగ్యకరమైన కూరగాయల సాగు.

కార్యక్రమ ప్రణాళిక..
ఏప్రిల్ 26వ  తేదీ మధ్యాహ్నం 2:45 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో పరిచయ వాక్యాలు, గ్రీన్‌హౌస్ సందర్శన, నేరుగా పొలంలో శిక్షణ , సందేహాల నివృత్తి (Q&A) సెషన్ ఉంటాయి. అలాగే సమాజంలో అవగాహన కల్పించేందుకు ‘కమ్యూనిటీ సీడ్ ఎక్స్ఛేంజ్’ (విత్తనాల మార్పిడి) కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు.

రిజిస్ట్రేషన్ వివరాలు..
ఈ వర్క్‌షాప్‌లో పాల్గొనే వారికి ఉచితంగా విత్తనాలు లేదా మొక్కలు అందజేయనున్నారు. (స్టాక్ ఉన్నంత వరకు). స్థలం పరిమితంగా ఉన్నందున ఆసక్తి గల వారు వెంటనే https://bit.ly/48eJLbj లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని టాటా చేయూత బృందం ప్రతినిధి భూమేష్ గండే కోరారు. ‘టాటా’ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 2026 ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రకృతి ప్రేమికులందరూ తమ అనుభవాలను పంచుకోవాలని పిలుపునిచ్చారు.

Leave a Comment