আবহাওয়া পশ্চিমবঙ্গ ভারত চাকরি রাশিফল আইপিএল আধ্যাত্মিক টাকা পয়সা স্বাস্থ্য লাইফস্টাইল মিউচুয়াল ফান্ড ব্যবসা অন্যান্য শেয়ার বাজার টিভি সিরিয়াল

గతంలో రూ. లక్ష కోట్లు.. ఇప్పుడు రూ.9 వేల కోట్ల స్కామ్ మాత్రమే : బండి సంజయ్

By charangadgets4

Published on: April 21, 2026

Follow Us

---Advertisement---

కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)లో గతంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారని, ఇప్పుడు రూ.9 వేల కోట్ల స్కామ్ మాత్రమే జరిగిందని ప్రభుత్వం సీబీఐ (CBI)కి లేఖ రాసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రూ.లక్ష కోట్ల స్కామ్ అని విచారణ జరపాలా? రూ.9 వేల కోట్ల స్కామ్ అని విచారణ చేపట్టాలా? సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) చెప్పాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ఒక్కటే. ఒకరి అవినీతిని మరొకరు ప్రోత్సహిస్తున్నారు. కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిపై కూడా చర్య తీసుకోలేదు. కాళేశ్వరం కుంభకోణంలో రేవంత్ రెడ్డే కేసీఆర్ (KCR) ను కాపాడుతున్నారు. బీఆర్ఎస్ మాదిరే కాంగ్రెస్కూ కాళేశ్వరం ఏటీఎంగా మారింది అని ఆరోపించారు.

Leave a Comment