TATA: ధరిత్రీ దినోత్సవం (Earth Day) సందర్భంగా ప్రకృతిపై మక్కువతో, స్వచ్ఛమైన ఆహారం పండించుకోవడమే లక్ష్యంగా ట్రయాంగిల్ ఏరియా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ కరోలినా (TATA) ఒక ప్రత్యేకమైన ‘ఆర్గానిక్ గార్డెనింగ్ వర్క్‌షాప్’ను నిర్వహిస్తోంది. ఈ నెల 26వ తేదీ, ఆదివారం క్యారీలోని ఎల్విఎస్ ఆర్గానిక్ ఫామ్స్ (LVS Organic Farms) వేదికగా ఈ శిక్షణ కార్యక్రమం జరగనుంది.
ఇవి కూడా చదవండి
అవగాహన..
ప్రముఖ సేంద్రియ సాగు నిపుణురాలు , ఫామ్ మెంటర్ లక్ష్మి రామకృష్ణన్ ఈ సెషన్‌కు నాయకత్వం వహిస్తారు. పాల్గొనే వారికి ఈ కింది అంశాలపై అవగాహన కల్పిస్తారు.
- మట్టిని సిద్ధం చేయడం , ఎరువుల వినియోగం.
- విత్తనాలు వేయడం , సాగు పద్ధతులు.
- నీటి యాజమాన్యం , కలుపు నివారణ.
- పంట కోత , నిల్వ చేసే విధానాలు.
- పురుగు మందుల ప్రభావం తగ్గించి ఆరోగ్యకరమైన కూరగాయల సాగు.
కార్యక్రమ ప్రణాళిక..
ఏప్రిల్ 26వ తేదీ మధ్యాహ్నం 2:45 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో పరిచయ వాక్యాలు, గ్రీన్హౌస్ సందర్శన, నేరుగా పొలంలో శిక్షణ , సందేహాల నివృత్తి (Q&A) సెషన్ ఉంటాయి. అలాగే సమాజంలో అవగాహన కల్పించేందుకు ‘కమ్యూనిటీ సీడ్ ఎక్స్ఛేంజ్’ (విత్తనాల మార్పిడి) కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు.
రిజిస్ట్రేషన్ వివరాలు..
ఈ వర్క్‌షాప్‌లో పాల్గొనే వారికి ఉచితంగా విత్తనాలు లేదా మొక్కలు అందజేయనున్నారు. (స్టాక్ ఉన్నంత వరకు). స్థలం పరిమితంగా ఉన్నందున ఆసక్తి గల వారు వెంటనే https://bit.ly/48eJLbj లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని టాటా చేయూత బృందం ప్రతినిధి భూమేష్ గండే కోరారు. ‘టాటా’ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 2026 ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రకృతి ప్రేమికులందరూ తమ అనుభవాలను పంచుకోవాలని పిలుపునిచ్చారు.
Leave a Comment